|
|
by Suryaa Desk | Wed, May 07, 2025, 01:53 PM
దుబ్బాక నియోజకవర్గం ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక మండలంలోని సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబ్బాక ఎమ్మెల్యే మతిభ్రమణంతో వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించడం సిగ్గుచేటని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. "నీ సొంత గ్రామంలో 16 ఇండ్లు కేటాయించాం. కానీ, టిఆర్ఎస్ పాలనలో వివక్ష చూపించి, తుక్కాపూర్ గ్రామానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు" అని ఆయన ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, గత పాలనలో జరిగిన వివక్షను గుర్తుచేస్తూ, ప్రస్తుతం న్యాయంగా ఇండ్ల కేటాయింపు జరుగుతోందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.