|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 03:48 PM
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద భారీగా నిధులు ఖర్చు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ఈ నిధులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి అని ప్రశంసించారు.
“మేము మాటలకోసం కాదు, మానవ సేవ కోసమే పనిచేస్తున్నాం. ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన మాకు లేదు,” అని భట్టి స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం 104 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా రంగంలో సమానత్వానికి ఇది పెద్ద అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలాగే, వైద్య సేవల పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో కాస్మొటిక్స్ చార్జీలు 200 శాతం పెంచినట్లు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల సేవల నాణ్యత మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు.