|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 10:25 AM
హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం భీభత్సంగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రేవంత్ రెడ్డి పలు ప్రాంతాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.ప్రచారం మొదటి విడతగా షేక్‌పేట్ డివిజన్ పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు. పారామౌంట్ కాలనీ గేట్–3 నుంచి గేట్–2, గేట్–1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం ఎంఎస్ అకాడమీ వద్ద ఆయన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.తరువాత వెంకటగిరి వాటర్ ట్యాంక్ నుంచి కృష్ణానగర్ బీ బ్లాక్ మీదుగా యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వరకు రోడ్ షో కొనసాగనుంది. రాత్రి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద చివరి కార్నర్ మీటింగ్ జరగనుంది.