బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 04:52 PM
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపుకు దూసుకెళ్లింది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔశాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు 38 మంది ప్రయాణికులతో జనగామ నుంచి ఉప్పల్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఔశాపూర్ వద్ద ముందున్న కారును డ్రైవర్ ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.