|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 09:48 PM
గత వారం ఓటీటీలో పలు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషల సినిమాలు, సిరీస్‌లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై సందడి చేస్తున్నారు. వీటిలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లాంటి అన్ని జానర్ల కంటెంట్ కూడా ఉన్నాయి.అయితే, గత వారమే స్ట్రీమింగ్‌కు వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. ఆసక్తికరమైన కథా అంశాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టుల వల్ల ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ను అందిస్తోంది.కథ ఏమిటంటే… ఇది ఒక మైథాలజీ క్రైమ్ థ్రిల్లర్. ఒక ఊరిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. గ్రామస్తులు నమ్ముతున్నారు, పాపం చేసిన వారిని శంకాసుర్ శిక్షిస్తాడు. కానీ వాస్తవం వేరే. ఈ దారుణ హత్యల వెనక కొందరి వ్యక్తుల హస్తం ఉంటుంది, వారు దేవుడి పేరుతో murders చేస్తున్నారు.కిల్లింగ్ మిస్టరీని, హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. కానీ హంతకుల కంటే, ఊరి ప్రజల నుండి పోలీసులు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. ఏ ఒక్కరూ పోలీసులకు సహాయం చేయరు.అయితే పోలీసులు వెనక్కు తగ్గరు. అవమానం చేస్తూ కనిపించే ఊరి ప్రజల్లోనే హంతకులు ఉన్నారని వారు గుర్తిస్తారు. మరి హంతకులు ఎవరన్నది? వరుస హత్యల వెనుక అసలు మర్మం ఏమిటి? మధ్యలో శంకాసుర్ స్టోరీ ఏంటి? ఈ ప్రశ్నలకి జవాబు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలి.ప్రస్తుతానికి ఈ సిరీస్ “దేవ్‌ఖేల్” పేరుతో ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఒక మరాఠీ వెబ్ సిరీస్. చంద్రకాంత్ లతా గైక్వాడ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో అంకుష్ చౌదరి, ప్రజక్తా మాలి, యతిన్ కార్యేకర్, అరుణ్ నలవాడే, వీణా జమ్కర్, మంగేష్ దేశాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో, మొత్తం 7 ఎపిసోడ్స్‌తో జనవరి 30న జీ5 ఓటీటీలో విడుదలైంది.
Latest News