|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:27 AM
నటి దీపికా పదుకొణె తన కుమార్తె దువా గురించి ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. 'ప్రస్తుతం నా ప్రపంచమంతా నా కూతురి చుట్టూనే తిరుగుతోంది. ఆమె నాకు అన్నింటికన్నా ఎక్కువ' అని ఎమోషనల్ అయ్యింది. రోజులో అత్యధికంగా వాడే పదం 'ఐ లవ్ యు' అని, అది కూడా తన కూతురి కోసమేనని వెల్లడించింది. కెరీర్ పట్ల తనకున్న దృక్పథాన్ని పంచుకుంటూ, జీవితంలో నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, పరిశ్రమలో మరింత మెరుగ్గా ఎలా రాణించాలనే దానిపై దృష్టి పెట్టానని తెలిపింది.ఇక తాను హీరోయిన్ అవకపోయుంటే ఇంటీరియర్ డిజైనర్ అయ్యేదాన్ని అని దీపికా పేర్కొంది. అయితే తన భర్త, హీరో రణ్‌వీర్ సింగ్ మాత్రం నేను మంచి లాయర్ అవాల్సింది అని అంటుంటాడని తెలిపింది. దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2024లో కూతురు దువా జన్మించింది. ప్రస్తుతం దీపికా.. కింగ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ఇటీవలే ధురంధర్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు.
Latest News