|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:34 AM
మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా గుర్తింపు పొందిన మేఘనా ముఖర్జీ, ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్నారు. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేఘనా తాజా ఫోటోషూట్ వైరల్ అయింది. సౌరవ్ గంగూలీ నటించిన యాడ్‌లోని ‘మోనా డార్లింగ్’ పాత్రతో మేఘనా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫ్యాషన్, అడ్వర్టైజింగ్ రంగాల్లోనూ ఆమె రాణించారు. ‘బరాబర్ ప్రేమిస్తా’లో ఆమె పాత్ర కథకు కీలకంగా ఉంటుందని, యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది.
Latest News