|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:38 AM
ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుపై కేసు నమోదు అయింది. తిరుపతిలోని తిరుచానూరు స్టేషన్‌లో వీరితో పాటు MBU (మోహన్ బాబు యూనివర్సిటీ) పీఆర్వో సతీష్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీకి చెందిన MBUలో అధిక ఫీజులపై కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్న సమయంలో SFI నేతలు అక్బర్, వినోద్‌లను MBU బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.మరోవైపు వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ర్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ పీఆర్వో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యాన్ని డబ్బు కూడా డిమాండ్ చేశారన్నారు. దీంతో విద్యార్థి సంఘం నేత అక్బర్‌తో పాటు మరికొందరిపై చంద్రగిరి పీఎస్‌లో కేసు నమోదైంది.
Latest News