|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 01:00 PM
బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన మృణాల్ ఠాకూర్, బాలీవుడ్‌లో 'సూపర్ 30', 'బాట్లా హౌస్' వంటి చిత్రాలతో హిట్ అందుకుంది. అయితే, 'జెర్సీ' వంటి చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో పాటు, బాలీవుడ్‌లో వరుస డిజాస్టర్లు ఎదుర్కొంది. ఈ సమయంలోనే టాలీవుడ్‌లో 'సీతామహాలక్ష్మీ'గా భారీ విజయం సాధించి, తన క్రేజ్‌ను పెంచుకుంది. టాలీవుడ్ సీతామహాలక్ష్మీగా మారాక మళ్లీ బాలీవుడ్ బాట పట్టిన మృణాల్‌కు గుమ్రా, ఆంఖ్ మిచోలీ డిజాస్టర్లుగా మారాయి. గోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ సిరీస్ చిత్రాలతో కాస్తో కూస్తో ఇమేజ్ నిలబడింది. తెలుగులో హాయ్ నాన్న హిట్టు మరోసారి ఆమె కెరీర్‌కు బూస్టర్ అయ్యింది. ఇలా ఆమె బీటౌన్ ముంగిట్లో ఫెయిలవుతున్న ప్రతిసారి టాలీవుడ్ ఆదుకుంది. ఇక గత ఏడాది వచ్చిన సన్నాఫ్ సర్దార్2 డిజాస్టర్. 7 ఏళ్ల నుండి బాలీవుడ్‌లో హిట్టే చూడని మృణాల్‌కు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లు ఇచ్చి.. రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరమే అయినప్పటికీ.. సౌత్‌లో ఉన్న క్రేజే ఆమెకు ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాయి. ప్రజెంట్ మృణాల్ దో దీవానే శెహర్ మే రొమాంటిక్ లవ్ స్టోరీతో బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకోబోతుంది.
Latest News