|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:45 PM
తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగు నటి ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ చేయడంతో, ఈషా అతడి ఐడీతో పాటు కామెంట్‌ను పోలీసులకు అందించిన ఫిర్యాదులో వివరించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కామెంట్స్ పెట్టినట్లు గుర్తించి విచారణ జరుపుతున్నారు. ఇక ఈషా రెబ్బ విషయానికొస్తే చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన ఈషా రెబ్బ.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అలాగే సెకండ్ హీరోయిన్ గాను మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఇక ఇటీవలే ఓం శాంతి శాంతి శాంతిః అనే సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Latest News