|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:56 PM
దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రం 'ఆగడు' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడానికి గల కారణాలను వివరించారు. ఒక రైటర్‌గా, దర్శకుడిగా తన బాధ్యతలను వివరిస్తూ, సినిమా విజయం లేదా అపజయానికి దర్శకుడే పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. 'ఆగడు' స్క్రిప్టింగ్ సమయంలో కళ్యాణ్ రామ్‌తో తన మొదటి సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల, రెండో భాగానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయానని తెలిపారు.ఆగడు ఫస్టాఫ్ కామెడీగా తీయగా.. రెండో హాఫ్‌లో కాస్త సెంటిమెంట్‌తో తీస్తే బాగుంటుందని అనిల్ రావిపూడికి ఆలోచన వచ్చిందట. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీనువైట్లకు చెబుదామని సినిమా సెట్లోకి వెళ్లగా.. అప్పటికే సెకండాఫ్‌ను చిత్రబృందం ప్రారంభించిందని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Latest News