|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 04:01 PM
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, తన స్నేహితురాలు, ప్రేయసి అయిన నయనికతో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోని జే 1 బీచ్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అల్లు శిరీశ్ తన కాబోయే భార్య నయనిక రెడ్డితో కలిసి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంన్నారు. దుబాయ్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య 'క్లాసీ ప్రీ వెడ్డింగ్ పార్టీ' నిర్వహించారు. సముద్ర తీరంలో జరిగిన ఈ వేడుకల్లో ఆనంద క్షణాలు, నవ్వులు, షాంపైన్ సెలబ్రేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. లేత గోధుమ రంగు సూట్‌కు బోల్డ్ నలుపు, బంగారు ప్రింటెడ్ షర్ట్ ధరించారు. మరోవైపు, స్నేహ రెడ్డి సింపుల్ అండ్ ఎలిగెంట్ వెస్ట్రన్ అవుట్ ఫిట్‌లో మెరిశారు. శిరీశ్ ప్రీ వెడ్డింగ్‌లో ఈ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బన్నీ ఫ్యాన్స్ ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Latest News