by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:56 PM
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్, మాస్టర్ మూవీ మేకర్ శంకర్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను జనవరి 10 నుంచి ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అలరించనున్న సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రేక్షకులు రామ్ చరణ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి లార్జర్‌దేన్ లైఫ్ వంటి ఈ సినిమాను లార్జర్ స్క్రీన్‌లో చూస్తే కలిగే అనుభూతే మరో రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహం లేదు. అందులో భాగంగా ప్రేక్షకులను ఓ సరికొత్త అనుభవాన్ని అందించటానికి ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. దీనిపై రామ్ చరణ్ స్పందించారు. ‘‘గేమ్ చేంజర్’ మూవీ నా హృదయానికెంతో దగ్గరైన చిత్రం. శంకర్‌గారితో కలిసి ఈ సినిమా కోసం పని చేయటం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ఐమ్యాక్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని తెలియటంతో నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.తమన్ సంగీత సారథ్యం వహించిన ఈ భారీ యాక్షన్ డ్రామా పొలిటికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఓ మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు. రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించారు. ఎస్.జె.సూర్య, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు.
Latest News