by Suryaa Desk | Tue, Jan 07, 2025, 08:40 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చేసింది. పుష్ప-2 చిత్రానికి మరో 20 నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజిని జోడిస్తున్నారు. దాంతో ది వైల్డ్‌ఫైర్ మరింత ఎక్స్‌ట్రా ఫైరీగా మారబోతోందని చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ పవర్ ఫుల్ రీలోడెడ్ వెర్షన్ జనవరి 11 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ మేరకు మేకర్స్... అల్లు అర్జున్ చేతిలో గొడ్డలితో ఉగ్రరూపంతో ఉన్న ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా పంచుకున్నారు.అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో డిసెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయం నమోదు చేసింది. భారతీయ సినీ రికార్డులను తిరగరాస్తూ మరో చరిత్రను సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్ నెంబర్‌వన్ ఫిల్మ్‌గా 'పుష్ప-2' ది రూల్ నిలిచింది. ఈ క్రమంలో 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో రూ.1,831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్ఠించింది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తోంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది.
Latest News