![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:53 PM
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్' బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. జైలర్ సినిమాతో సూపర్ రజనీకాంత్ సృష్టించిన సంచలనాన్ని సినీ ప్రేమికులు మర్చిపోలేరు. సినిమా సీక్వెల్ ప్లాన్ చేసినప్పుడు సినిమా ప్రకటన ప్రోమో అభిమానులను మరియు సినిమా సినీ ప్రేమికులని ఆశ్చర్యపరిచింది. బ్లాక్ బస్టర్ జైలర్‌కు సీక్వెల్ ప్రధాన భారతీయ భాషలతో పాటు ఆంగ్లంలో విడుదల కానున్నట్లు పుకారు ఉంది. సోషల్ మీడియాలో బజ్ ప్రకారం, ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 2026 వేసవిలో విడుదల కానున్నట్లు సమాచారం. మేకర్స్ ఏప్రిల్ 2026 విడుదలను లక్ష్యంగా చేసుకున్నారు అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఇటీవల రజిని ఈ సెట్స్‌లో చేరారు మరియు జట్టు కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఈ క్రేజీ సీక్వెల్‌కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News