|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 01:07 PM
రాకేశ్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి మేకర్స్ 'బ్లైండ్ స్పాట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో యువ నటి రాశి సింగ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. రవి వర్మ మరియు గాయత్రి భార్గావి, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా కీలక పాత్రల్లో ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ దర్శన్ ఎమ్ అంబాట్, ఎడిటర్ సత్య జి మరియు శ్రీ రామ్ మాడ్యూరీ నేపథ్య స్కోరు అందిస్తున్నారు. రామా కృష్ణ వీరపనేని మామిడి మాస్ మీడియా బ్యానర్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీ రామ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News