|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 02:05 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 01:20 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సహా కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు.
కొత్త తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా, చరిత్ర పుటల్లో తన పేరును లిఖించిన రెండో వ్యక్తి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మరో 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కింది. మధిర ఎమ్మెల్యే భట్టి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి దక్కింది. ఈ మేరకు వారి పేర్లనును నాయకులు గవర్నర్ కు అందజేశారు. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే వారికి ఫోన్ చేసి చెప్పారు. భట్టికి డిప్యూటీ సీఎం కేటాయించినట్లు తెలుస్తుంది. పొంగులేటి, తుమ్మల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.