|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 02:10 PM
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. మొదట రేవంత్ రెడ్డి సీఎం. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇప్పటికే ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం బహిర్గతం చేసింది. తొలిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినవారవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా.. సీపీఎం 1 స్థానంలో విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిపై తర్జనభర్జన చేసిన కాంగ్రెస్ కేంద్ర అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్‌ను నిర్ణయించింది. ఆయనతో పాటు మరో 11 మందికి మంత్రి పదవులను కూడా ఫైనల్ చేసింది. ఎల్బీ స్టేడియంలో నేడు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.