|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 03:12 PM
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.''ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి అభినందనలు. రాష్ట్రాభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హమీ ఇస్తున్నా'' అని ప్రధాని తన ట్విటర్‌లో పోస్టు చేశారు.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా.. మల్లు భట్టివిక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. వీరితోపాటు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో చేరారు.