|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 11:39 AM

ఈ నెల 22న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎమ్డీ హైదరాబాద్ తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.21, 23న తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వివరించింది. ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.