![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 02:38 PM
రాయికోడ్ మండలం సింగీతం లో మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మండల తాజా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుసలి ప్రభాకర్ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు, యువకులు పాల్గొన్నారు.