|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 02:32 PM
పటాన్చెరు : జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్చెరు, రామచంద్రపురం, భారతి నగర్ డివిజన్ల పరిధిలో గల ప్రతి వీధి దీపం వెలగాల్సిందేనని.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి విద్యుత్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్దియా పరిధిలోని మూడు డివిజన్ల పరిధిలో విద్యుత్ స్తంభాలు, లైట్ల పనితీరుపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షించాలని సూచించారు. కాలనీలలో వీధి దీపాలు వెలగకపోవడం మూలంగా అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతాయని అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను బిగించాలని ఆదేశించారు. వీధి దీపాల అంశంలో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ విభాగం డిఈ లక్ష్మీ ప్రియ, ఏఈ లికిత, తదితరులు పాల్గొన్నారు.