![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 05:16 PM
సీనియర్ హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్ నటిస్తున్న మూవీ అఖండ–2. ఇటీవల చిత్ర యూనిట్ మహాకుంభమేళాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. అయితే తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్‌లో మూవీ విడుదలవుతుందని తెలిపారు. సంయుక్త ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటోందిమరి లేటెస్ట్ గా సాలిడ్ అప్డేట్ ఈ సినిమాపై తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారట. బాలయ్యపై సినిమాలో ఇది మరో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచే విధంగా బోయపాటి ప్రత్యేకంగా డిజైన్ చేయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా యాక్షన్ పరంగా మాత్రం అఖండ 2 వేరే లెవెల్ ట్రీట్ ని అందించేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Latest News