![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 12:32 PM
'క' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రం సక్సెస్‌తో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దాంతో కిరణ్ నటిస్తున్న 'దిల్ రూబా' చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. దీనికి తోడు ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ కూడా వచ్చింది. అయితే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'దిల్ రూబా' చిత్రంప్రేక్షకులను ఆకట్టుకుందా? ఎలాంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది? ఈ చిత్రం కిరణ్ అబ్బవరంకు హిట్‌ను అందించిందా? లేదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే... కథ: సిద్ధు రెడ్డి (కిరణ్ అబ్బవరం) చిన్నప్పటి తనతో కలిసి పెరిగిన మ్యాగీ (క్యాతి డేవిసన్) ను ప్రేమిస్తాడు. ఆపదలో ఉన్న ఓ స్నేహితుడిని తన బిజినెస్‌లో పార్టనర్‌గా చేర్చుకుంటే, ఆ స్నేహితుడే తనను మోసం చేయడం తట్టుకోలేక ఆ బాధలో సిద్ధు తండ్రి మరణిస్తాడు. ఈ తరుణంలోనే కొన్ని కారణాల వల్ల మ్యాగీతో సిద్ధుకు బ్రేకప్ అవుతుంది. ఇక అప్పటి నుంచే తన జీవితంలో సారీ, థ్యాంక్స్ అనే మాటలకు దూరంగా ఉండాలని సిద్ధు నిర్జయించుకుంటాడు. ఇక బ్రేకప్ నుంచి మూవ్ అన్ అవ్వడానికి బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు సిద్ధు. అక్కడ పరిచయమైన అంజలి (రుక్సర్ థిల్లాన్)ను ప్రేమిస్తాడు. అయితే కాలేజీలో జరిగిన ఓ గొడవ వల్ల వీళ్లిద్దరు కూడా విడిపోవాల్సి వస్తుంది. అమెరికాలో ఉంటున్న మ్యాగీ ఇది తెలుసుకుని ఇండియాకు చేరుకుంటుంది. ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుంది. అయితే సిద్ధు-అంజలి మధ్య జరిగిందేమిటి? ఈ ఇద్దరిని మ్యాగీ ఎలా కలిపింది? అసలు మ్యాగీ, సిద్ధుకు బ్రేకప్ చెప్పడానికి కారణమేమిటి? అనేది మిగతా కథాంశం.
Latest News