|
|
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:36 AM
'తండేల్’తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు చందూ మొండేటి. ఆయన తదుపరి సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ కథానాయకుడు సూర్య కోసం ఓ కథ సిద్థం చేశారు చందూ. ఇప్పటికే ఆయనకు వినిపించారు కూడా. సూర్యకు కథ నచ్చింది. అయితే సూర్య ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. సూర్య డేట్లు దొరకాలంటే కొంత కాలం వేచి చూడాలి. ఈలోగా గీతా ఆర్ట్స్‌లో చందూ ఓ సినిమా ఓ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎనర్జీటిక్ స్టార్ రామ్ కోసం ఓ కథని చందూ రెడీ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇటీవల రామ్‌ని సైతం చందూ మొండేటి కలిశారని, తన ఐడియా చెప్పారని, రామ్ కూడా చందూతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమానీ గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (వర్కింగ్ టైటిల్స్) అనే సినిమాలో నటిస్తున్నారు. అన్నీ కుదిరితే ఇది పూర్తయ్యాక చందూతో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ వుంది. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
Latest News