![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:21 AM
హీరో నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన సినిమా 'కోర్ట్'. ప్రియదర్శి .. హర్ష్ రోషన్ .. శ్రీదేవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో నాని మాట్లాడుతూ ఈ సినిమా పట్ల తనకి గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. తాను చెబుతున్నట్టుగా ఈ సినిమా లేకపోతే, ఆ తరువాత రానున్న తన 'హిట్ 3' మూవీని చూడొద్దంటూ అందరి దృష్టిని ఈ సినిమా వైపుకు మళ్లించాడు. మరి నిజంగానే ఈ సినిమా ఆ రేంజ్ లో ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ: 2013లో .. విశాఖపట్నం నేపథ్యంలో జరిగే కథ ఇది. భర్తను కోల్పోయిన సీతారత్నం (రోహిణి) తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ఇంటర్ చదువుతున్న ఆమె కూతురు జాబిలి (శ్రీదేవి), చందూ (హర్ష రోషన్)ను ఆటపట్టించబోయి అతని ప్రేమలో పడుతుంది. చందు ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇంటర్ ఫెయిల్ కావడం వలన చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటాడు. తాము అనుకున్నట్టుగా అతను చదవలేకపోవడం గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు.మంగపతి రైస్ మిల్ నడుపుతూ స్థానిక రాజకీయాలలోను కనిపిస్తూ ఉంటాడు. డబ్బుకీ .. పరువుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే వ్యకి అతను. తన పరువును కాపాడుకునే క్రమంలో తన వాళ్లందరినీ భయపెట్టేస్తూ ఉంటాడు. తండ్రిలేని జాబిల్లి కుటుంబం మేనమామ అయిన మంగపతిపై ఆధారపడుతుంది. చందుతో జాబిల్లి లవ్ లో పడిందని తెలిసిన అతను కోపంతో ఊగిపోతాడు. జాబిల్లిని మైనర్ గా పేర్కొంటూ, తన పలుకుబడిని ఉపయోగించి చందుపై 'పోక్సో' చట్టంతో పాటు ఇతర సెక్షన్లపై కూడా కేసు పెడతాడు. మంగపతికి సీనియర్ లాయర్ దామోదర్ ( హర్షవర్ధన్)తో మంచి పరిచయం ఉంటుంది. అందువలన ఈ కేసులో నుంచి చందు బయటకి రాకుండా అతను అన్ని వైపుల నుంచి కేసును బిగిస్తుంటాడు. మోహన్ రావు (సాయికుమార్) దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేసే సూర్యతేజ (ప్రియదర్శి)కి ఈ కేసులో చందుకి అన్యాయం జరుగుతుందని భావించి రంగంలోకి దిగుతాడు. చందు నిర్దోషి అని అతను నిరూపించగలుగుతాడా? డబ్బు .. పలుకుబడి ఉన్న మంగపతి నెగ్గుతాడా? అనేది కథ.
Latest News