![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:29 AM
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన సినిమా 'ఆర్టిస్ట్'. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించారు. దీనికి రతన్ రిషి దర్శకత్వం వహించారు. 'ఆర్టిస్ట్' మూవీ ఈ నెల 21న జనం ముందుకు వస్తోంది. దీనిని నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, ''సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ఆర్టిస్ట్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ''చూస్తూ చూస్తూ, ఓ ప్రేమా..'' సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లోనూ ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. ఇందులో ఇతర కీలక పాత్రలను 'సత్యం' రాజేశ్ , ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సోనియా ఆకుల తదితరులు పోషించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.
Latest News