![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 12:58 PM
టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవికి తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది.. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు.ఈనెల 19వ తేదీన యూకే పార్లమెంటులో ఈ కార్యక్రమం జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఈ పార్లమెంటులో సోజన్ జోసెఫ్, బాబు బ్లాక్ ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారట. ఇక ఇదే వేదిక పైన బ్రిడ్జ్ ఇండియా సంస్థ.. అటు సినిమాలలో చిరంజీవి చేసిన కృషికి ప్రజా సేవలో తనకు ఉన్న మంచి పేరుకు జీవిత సాఫల్య పురస్కారం కూడా అందజేయబోతున్నారట. వీరితో పాటు వివిధ రంగాలలోని వ్యక్తులు సాధించిన విజయాలు సమాజంలో వారి పైన ఉన్న ప్రభావం మరింత వికృతం చేసేలా వారిని సత్కరించేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును సైతం మొదటిసారిగా అందజేస్తున్నారు. ఇది చిరంజీవి కూడా అందుకోవడమే గమనార్హం.2024లో ఇండియా ప్రభుత్వం నుంచి దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని పద్మ విభూషణ్ ను సైతం మెగాస్టార్చిరంజీవి అందుకున్నారు. చిరంజీవి చిత్రాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లోనే తీస్తున్నారు. త్రిష ,ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గానే కాకుండా తదితర నటీనటులు ఇందులో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు ఆ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఒక మాస్ చిత్రని చేయబోతున్నారు చిరంజీవి.
Latest News