![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:31 AM
తమిళ సినిమా రంగంలోని అగ్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సినిమా నిర్మించిన అగ్ర కథానాయకుల చిత్రాలు వరుసగా పరాజయం పాలు కావడమే దానికి కారణం. మణిరత్నం దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించిన 'పొన్నియన్ సెల్వన్-2' తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ విజయం ఈ సంస్థకు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన ''చంద్రముఖి-2, మిషన్ చాప్టర్ -2, లాల్ సలామ్, ఇండియన్ -2, వేట్టైయాన్'' వరుసగా పరాజయం పాలయ్యాయి. ఇక పలు మార్లు వాయిదా పడి, ఎట్టకేలకు ఫిబ్రవరి మొదటివారంలో విడుదలైన అజిత్ 'విడా ముయార్చి' సైతం భారీ నష్టాన్ని సంస్థకు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలన్నీ భారీ స్థాయిలో రూపుదిద్దుకున్నవే! ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న పలు చిత్రాలు అనుకున్న సమయంలో పూర్తి కావడం లేదు లేదా విడుదలను పలు మార్పు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.ఇక ఈ సంస్థ నిర్మిస్తున్న 'ఎంపురాన్' చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్నాడు. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లూసిఫర్'కు ఇది సీక్వెల్. దాంతో సహజంగానే మూవీకి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా మార్చి 27న వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. అయితే... రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే సరికీ అనుకున్న తేదీన 'ఎంపురాన్' విడుదల అవుతుందా లేదా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే... 'ఎంపురాన్' మూవీ బిజినెస్ ఎలా జరిగినా... లైకా ప్రొడక్షన్స్ పాత బాకీలు ఈ సినిమాపై పడే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లోని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఓల్ట్ బాలెన్స్ సెటిల్ చేసిన తర్వాతే 'ఎంపురాన్' మూవీని విడుదల చేయాలని పట్టుబట్టే ఆస్కారం కనిపిస్తోంది. అలానే కొందరు ఫైనాన్షియర్స్ కోర్టు తలుపు తట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దాంతో ఇప్పుడు 'ఎంపురాన్' రిలీజ్ పై నీలినీడలు వ్యాపించాయి.
Latest News