![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:33 AM
ప్రియదర్శి ప్రధాన పాత్రలో హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘కోర్ట్’. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాగా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చూసి ప్రశంసలు కురిపించారు. స్క్రీన్ ప్లే బాగుందని నటీనటులు అందరూ బాగా యాక్ట్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే సినిమాను తీసిన నేచురల్ స్టార్ నానికి అభినందనలు తెలిపారు.2013 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు (చందు).. పెద్దింటి అమ్మాయి జాబిలి (శ్రీదేవి) ప్రేమ, తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమైంది. జాబిలి బంధువు మంగపతి పాత్రలో శివాజీ నటన అంతటా ప్రశంసలు దక్కించుకుంటోంది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. సినిమాపై ఉన్న నమ్మకంతో గురువారం కొన్ని థియేటర్లలో ప్రీమియర్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్, తొలిరోజు వచ్చిన కలెక్షన్స్‌ను టీమ్ తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని వెల్లడించింది. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది.
Latest News