![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:50 AM
తన స్నేహితురాలు గౌరీ స్ర్పాట్‌తో ఏడాదిన్నరగా డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ వెల్లడించారు. ఆమెతో తనది పాతికేళ్ల పరిచయం అన్నారు. ప్రస్తుతం గౌరీ తన ప్రొడక్షన్‌హౌస్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. నేడు ఆమిర్‌ఖాన్ 60వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో ఆయన గౌరీ స్ర్పాట్‌తో తన అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. గౌరీ స్ర్పాట్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారనీ, ఆమెకు గతంలో పెళ్లైందనీ, ఆరే ళ్ల కుమారుడు కూడా ఉన్నాడని చెప్పారు. నాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆమెతో అనుబంధం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా నా స్నేహితులు షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌కు ఇచ్చిన పార్టీకి కూడా గౌరి హాజరయినట్లు తెలిపారు. గతంలో రీనాదత్తా, కిరణ్‌రావును వివాహం చేసుకొన్న ఆమిర్ కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.
Latest News