![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:27 AM
మెగా సుప్రీం హీరో అని అభిమానులు ప్రేమగా పిలిచే సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం 'ఎస్.వై.జి.' (సంబరాల యేటిగట్టు) మూవీలో నటిస్తున్నాడు. 'హనుమాన్' చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. రోహిత్ కె. పి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సాయి దుర్గ తేజ్ నెవెన్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నాడు. హోలీ పండగ సందర్భంగా మేకర్స్ బ్యాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తం యూనిట్ సభ్యులంతా హోలీ పండగను ఘనంగా జరుపుకుని ఈ ఫోటో దిగినట్టుగా అనిపిస్తోంది. ముఖానికి రంగులతో ఆనందోత్సాహాలను వెలిబుచ్చుతూ టీమ్ మెంబర్స్ ఉండటం విశేషం.ఇప్పటికే ఈ సినిమా నుండి వెలువడిన కార్నేజ్ టీజర్ కు మంచి స్పందనల లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ లోని ఈ చిత్రబృందం పాటను చిత్రీకరిస్తోంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తున్న 'సంబరాల యేటిగట్టు'కు బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ఐదు భాషల్లో విడుదల కానుంది.
Latest News