![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:47 AM
‘హిట్’ సిరీస్ చిత్రాల నిర్మాత ప్రశాంతి తిపిర్నేని తాజా చిత్రం ‘కోర్ట్’. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో ప్రియదర్శి కథానాయకుడిగా రామ్ జగదీశ్ తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత ప్రశాంతి, సహ నిర్మాత దీప్తి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ‘‘ఈ కథను దర్శకుడు రామ్‌జగదీశ్ చాలా బాగా రాశారు. చాలా లేయర్స్ ఉన్న ఈ సినిమా స్ర్కీన్‌ప్లే అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పెయిడ్ ప్రీమియర్స్‌కు అద్భుత స్పందన వస్తోంది. ముఖ్యంగా సెకండా్‌ఫను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ప్రీమియర్స్‌కు వచ్చిన కొందరు లాయర్స్ సినిమా చాలా సహజంగా ఉందని మెచ్చుకున్నారు. సినిమాల విషయంలో నాని జడ్జిమెంట్ తప్పు కాదని ‘కోర్ట్’తో మరోసారి రుజువైంది. ఇందులో ప్రియదర్శి పాత్ర ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మంగపతిగా నటించిన శివాజీ పాత్రనూ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ‘హిట్ 3’ విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తాం’’ అని అన్నారు. సహ నిర్మాత దీప్తి మాట్లాడుతూ ‘‘రామ్ జగదీశ్ మంచి ప్రతిభావంతుడు. ఈ కోర్ట్ రూమ్ డ్రామాను చాలా ఆసక్తికరంగా మలిచాడు. సినిమాలోని ప్రతీ పాత్ర గుర్తుండిపోతుంది. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. భావోద్వేగాలు, కోర్ట్ సన్నివేశాలు, సంగీతం సినిమాకు ప్రధానాకర్షణ’’ అని చెప్పారు.
Latest News