|
|
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:45 AM
కథానాయికగా దక్షిణాదిన సత్తా చాటిన శ్రుతీహాసన్ కొన్ని హిందీ చిత్రాల్లోనూ కనిపించారు. ‘ద ఐ’ చిత్రంతో ఆమె హాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నారు. ఇటీవలే చిత్రబృందం శ్రుతి పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను షేర్ చేసిన నయనతార ‘చాలా బాగుంది శ్రుతీ’ అంటూ ప్రశంసించారు. ట్రైలర్‌లో శ్రుతి నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ‘ద ఐ’తో హాలీవుడ్‌లో శ్రుతికి శుభారంభం దక్కాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ‘ద ఐ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘నా కెరీర్‌లో ఇదో డిఫరెంట్ మూవీ అవుతుంది’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మార్క్‌రౌలీ కీలకపాత్ర పోషించారు. భర్త ఫెలిక్స్ కోసం అన్వేషిస్తూ సాగించే ప్రయాణం నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో శ్రుతి డయానా అనే పాత్ర పోషించారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.
Latest News