![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 05:25 PM
ధనుష్ తమిళంలో బిజీ యాక్టర్‌గా, డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు. తను డైరెక్ట్ చేసిన మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయింది.ఈ సినిమాతో తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేశాడు దనుష్. ధనుష్ చేతిలో టాలీవుడ్ నుంచి కుబేరా మూవీ కూడా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. జూన్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ధనుష్ ఇప్పుడు హిందీలో రాంజనా సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఇది అయిపోగానే రాజ్‌కుమార్ పెరియసామితో సినిమా ఉంటుంది. దీనికి D55 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. రాజ్ కుమార్ పెరియసామి రీసెంట్ గా బ్లాక్ అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగ ానటించిన ఈసినిమా మేజర్ ముకుంద వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది. ఈ సినిమాను మధురై అన్బుచెళియన్ కూతురు ప్రొడ్యూస్ చేస్తోంది. జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇది బయోపిక్ అయ్యే ఛాన్స్ ఉంది. నటీనటుల సెలక్షన్ జరుగుతోంది. మరి ఈ సినిమా ఎవరి బయోపిక్ గా తెరకెక్కిస్తారు అనేది చూడాలి.
Latest News