![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:33 AM
కమెడియన్ సప్తగిరి కథానాయకుడిగా అభిలాశ్ రెడ్డి గోపిడి తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్’. దిల్‌రాజు సమర్పణలో కె.వై.బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘36 ఏళ్లు వచ్చినా పెళ్లికాని ఓ వ్యక్తి కథ ఇది. సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. సప్తగిరి మార్క్ వినోదం గ్యారంటీ’’ అని మేకర్స్ తెలిపారు. శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, రోహిణి, ప్రియాంక శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్: మధు, డీఓపీ: సుజాత సిద్ధార్థ్, సంగీతం: శేఖర్ చంద్ర.
Latest News