![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:32 AM
కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్‌రూబా’. విశ్వకరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘ప్రేమ, స్నేహంతో పాటు కుటుంబ విలువలు కలగలసిన అద్భుతమైన కథ ఇది. కథనం చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు విశ్వ కరుణ్ సినిమాలో రాసిన డైలాగ్స్, సన్నివేశాలు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కు కనెక్ట్ అయ్యే చిత్రమిది. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే ఈ చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకం. సినిమా తప్పకుండా అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. విజయంపై పూర్తి నమ్మకముంది’’ అని చెప్పారు. దర్శకుడు విశ్వకరుణ్ మాట్లాడుతూ ‘‘మనుషుల మధ్య తగ్గిపోయిన విలువలు, బంధాలను ఈ సినిమా తిరిగి గుర్తుచేస్తుంది. మంచి లవ్‌స్టోరీతో పాటు మాస్ ప్రేక్షకులను మెప్పించే ఫైట్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన దర్శకులు పూరి జగన్నాథ్, మెహర్ రమేశ్ ఫోన్ చేసి అభినందించారు. కిరణ్‌ను కొత్తగా చూపించే చిత్రమిది’’ అని అన్నారు. హీరోయిన్ క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ ‘‘ఇందులో మ్యాగీ పాత్రను పోషించాను. ఇటువంటి మంచి రోల్ దక్కడం నా అదృష్టం. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు’’ అని తెలిపారు.
Latest News