![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:42 AM
టాలీవుడ్ కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం.. ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత- మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ . ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. బ్రహ్మానందం తనదైన శైలి నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఆహా వేదికగా ఇది మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని టీమ్ వెల్లడించింది.
Latest News