![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 03:59 PM
అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా, మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల (గ్రాస్) సాధించినట్టు సమాచారం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అజిత్ కుమార్ కెరీర్‌లో 63వ చిత్రం.ఈ చిత్రంలో అజిత్ మూడు విభిన్న పాత్రలలో (గుడ్, బ్యాడ్, అగ్లీ) నటించారు. తమిళనాడులో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు 2,400 ప్రదర్శనలతో విడుదలై రూ. 28.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.ఇందులోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. త్రిష కథానాయికగా, అర్జున్ దాస్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. చిత్రం డిజిటల్ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 95 కోట్లకు కొనుగోలు చేసింది. మే నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. సుమారు రూ. 270-300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రస్తుత వసూళ్ల సరళి కొనసాగితే 2025లో విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News