|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 04:00 PM
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ వివిధ శైలి ఎంటర్టైనర్లలో నటించి ప్రేక్షకులని అలరిస్తున్నారు. నటుడు కేసరి 2, జాలీ ఎల్ఎల్బి 2 మరియు ఇతరుల చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కేసరి 2 ఏప్రిల్ 18, 2025న విడుదల అవుతుంది. తాజాగా చిత్ర బృందం అక్షయ్ కుమార్, ఆర్. మాధవాన్, అనన్య పాండే గోల్డెన్ టెంపుల్ ని సందర్శించారు. ఈ విసిట్ కి సంబందించిన చిత్రాలని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రం జల్లియన్‌వాలా బాగ్ ఉచకొత్త పై ఆధారపడింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సి. శంకరన్ నాయర్ పాత్రలో నటించారు, ఆర్. మాధవాన్ నెవిల్లే మెకిన్లీ గా మరియు అనన్య పాండే డిల్రీట్ కౌర్ గా నటిస్తున్నారు. కేసరి 1 తరువాత ఆరు సంవత్సరాల తరువాత ఈ చిత్రం విడుదల అవుతోంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
Latest News