![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:35 AM
ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో డివైడర్లపై ఏర్పాటు చేసిన ఆస్పత్రులు, దుకాణాల హోర్డింగ్స్, బోర్డులను టౌన్ ప్లానింగ్ అధికారుల నేతృత్వంలో డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్డులతో పాటు ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన బోర్డులను అధికారులు తొలగించారు. నగర ప్రజలకు అసౌకర్యంగా, ట్రాఫిక్కు అంతరాయం కలిగే విధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.