|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 12:10 PM

ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్లు ఆదా అయ్యిందని ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి పెరిగిందన్నారు. ‘సిలిండర్ల రాయితీ కింద రూ.433 కోట్లు చెల్లించాం. గృహజ్యోతి పథకం కోసం రూ.1,775 కోట్లు రాయితీ ఇచ్చాం. రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు, గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది’ అని భట్టి తెలిపారు.