![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 04:10 PM
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం యడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమమని, ఇది నిరుపేదల ఆత్మగౌరవం కోసం తెచ్చిన ప్రభుత్వ పథకం అంటూ పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగుల కోసం తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడిగించామన్నారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు 4 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు ఇచ్చిందని.. నల్లగొండ జిల్లా జీవనాడి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులకు రూ.4,518 కోట్లు బడ్జెట్లో కేటాయించామని.. టన్నెల్ మిషన్ చెడిపోతే అమెరికా నుండి తెప్పించామని పేర్కొన్నారు.