![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 04:15 PM
జగిత్యాల పట్టణంలోనీ కొత్తవాడ హనుమాన్ దేవాలయం, తహశీల్ చౌరస్తా వద్ద భారత్ సురక్ష సమితి నాయకులు మంగళవారం వీర హనుమాన్ విజయ యాత్రపై ప్రచారం చేశారు. ఏప్రిల్ 7న విశ్వహిందూ పరిషత్ భజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరహనుమాన్ విజయ యాత్రకి మాలదారులకి, భక్తులకి వీర హనుమాన్ విజయయాత్ర కరపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ రాజు, చీట్ల గంగాధర్, సింగం గంగాధర్ పాల్గొన్నారు.