![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 04:16 PM
భువనగిరి పట్టణంలోని సమద్ చౌరస్తాలో ప్రజా పాలన ప్రగతి బాటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఏనాడు పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన చెయ్యలేదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీతో తెల్ల రేషన్ కార్డ్లు కలిగిన పేదలకు సన్న బియ్యం సరఫరా అవుతాయని తెలిపారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేయబడుతున్నాయని కానీ వారు దానిని తినకుండా కిలో రూ.10కి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారని వివరించారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో రూ.50కి అమ్మి కోట్లు సంపాదిస్తున్నారన్నారు. అందుకే ప్రభుత్వం సన్న బియ్యం అందించాలని నిర్ణయించిందని అన్నారు. పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కాంగ్రెస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని అన్నారు. భారాస ఎల్లప్పుడూ రైతులను వరి పండించకుండా నిరుత్సాహపరిచేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ తహసీల్దార్ భగత్, కాంగ్రెస్ నాయకులు శ్యామ్ గౌడ్, తంగళ్ళపల్లి రవికుమార్, బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.