![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 05:19 PM
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, గోడం నగేశ్ ఉన్నారు.ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభ జీరో అవర్‌లో ఈ భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. 400 ఎకరాల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూముల విక్రయానికి సిద్ధమైందని ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను కాపాడాలని కోరారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. ఈ భూముల వ్యవహారంపై లోక్‌సభ జీరో అవర్‌లో తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు.