|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 10:47 AM
రాష్ట్రంలోని డ్యాముల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వచ్చాక గతంలో డ్యాముల భద్రతను పట్టించుకోలేదని, ఒక్క డ్యాముకూ సీడీఎస్ఈ రికార్డులు లేవని అధికారులు తెలిపారు. ఇటీవల కేంద్రం ఆదేశాలతో 2026 డిసెంబర్ నాటికి సీడీఎస్ఈ రిపోర్టులు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై రివ్యూ చేయనున్నారు. రాష్ట్రంలోని 173 డ్యాములకు సీడీఎస్ఈ నిర్వహణ తప్పనిసరి కానుంది.