|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:20 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి పట్టిన గ్రహణం వీడాలంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఈరోజు తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ పదేళ్లలో ఐటీ, ఫార్మా సహా అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయని, శాంతిభద్రతల పరిరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ప్రతీ అంశంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు. ఆ అభివృద్ధి ఫలాలు నగరంలోని ప్రతి పౌరుడికీ అందాయని, హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టామని ఆయన కొనియాడారు.