by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:17 PM
ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ29' పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్నట్లు సమాచారం. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ వేడుక హైదరాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌గా జరిగిన ఈ సినిమా లాంచింగ్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం.కాగా, జక్కన్న సినిమా కోసం సూపర్‌స్టార్ ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఉన్న రగ్ డ్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీలో చాలా రోజుల తర్వాత కొత్త మహేశ్ బాబును చూడబోతున్నామని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.
Latest News