|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 08:29 AM
మిచౌంగ్ సైక్లోన్ తుపాన్ ప్రభావంతో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా గత రాత్రి నుండి ఓ మోస్తరు జల్లులు కురుస్తుండడంతో పంట చేతికొచ్చిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తుండడంతో సాధారణ జనజీవనం కూడా ఇబ్బందికరంగా మారింది వర్షాలకు కల్లాల్లో రాశులు పోసిన దాన్యం స్వల్పంగా తడిసింది. ఇలానే కొనసాగితే పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు తెలిపారు.